కాకతీయ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు బుధవారం లిక్కర్ స్కాము కేసులో 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరపరిచారు. ఈ క్రమంలో కోర్టులో రాజ్ కసిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సిట్ అధికారులపై విమర్శలతో విరుచుకుపడ్డారు రాజ్ కసిరెడ్డి.
హైదరాబాద్ లో లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా సిట్ సీజ్ చేసిన రూ. 11కోట్లపై తనకు అనుమానాలు ఉన్నాయని కోర్టులో వాదించారు రాజ్ కసిరెడ్డి. అధికారులు రూ. 11కోట్ల విషయంలో ఆధారాలు ధ్వంసం చేస్తున్నారంటూ ఆరోపించారు. కాల్ డేటా రికార్డ్స్ ను స్వచ్చంద సంస్థతో విచారణ జరిపితే..అసలు విషయం బయటకు వస్తుందని కోర్టుకు విన్నవించుకున్నారు. సీబీఐ, సిట్ కలిసి ఆధారాలను ధ్వంసం చేస్తున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
అయితే గతంలోనూ సిట్ అధికారులపై రాజ్ కసిరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు. ఎక్కడెక్కడో పట్టుకున్న డబ్బును తకు లింక్ చేసి కట్టుకథలు అల్లుతొందని మండిపడ్డారు. సిట్ స్వాధీనం చేసుకున్న రూ. 11కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో వ్యాఖ్యానించారు రాజ్ కసిరెడ్డి.


