త్రిశక్తి ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ఆలయం ముస్తాబు
కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లోని శ్రీ మహంకాళి, శ్రీ పెద్దమ్మతల్లి, శ్రీ నల్ల పోచమ్మ త్రిశక్తి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కాటు జయరాములు, ఆలయ అధ్యక్షులు కదుల్లా ఎల్లేష్, సీనియర్ నాయకులు ఎల్లా వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని అన్నారు. ఉత్సవాలు జరిగే అన్ని రోజులలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగును ఏ కన్నుల పండువగా జరగనున్న ఈ మహాకార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈ దైవ కార్యానికి, ధన, వస్తు రూపేణా సహకరించి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు ఏళ్ల వెంకటేశం, కుమార్, కోశాధికారి నరేష్, కార్యవర్గ సభ్యులు రమేష్, కుమార్ కాటు కుమార్, కృష్ణ, మల్లేశం,ముదిరాజ్ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


