కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఓట్ల చోరీ విషయంలో ఈసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశ ప్రజలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు.ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎంక్వైరీ చేయడం లేదని..అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదన్న ఉద్దేశ్యం బీజేపీకి ఉందన్నారు.
రాహుల్ గాంధీకి ప్రధాన పదవి కొత్త కాదని..ఆ ప్రధాని పోస్టు పుట్టిందే వాళ్లింట్లో అన్నారు. ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ ప్రశ్నించడంతో రాహుల్ గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ద్వారా దొంగ ఓట్లు తయారు చేశారని మండిపడ్డారు. ఈసీ కూడా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ రీడర్ అంటూ ఆరోపించారు.
పాకిస్తాన్ లాంటి విధానాలు అమలు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. ఓటు హక్కు అందరి చేతిలో నుంచి పోవాలనేదే బీజేపీ ఆలోచన అన్నారు. రాహుల్ గాంధీ చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజనకు లెటర్లు ఇచ్చిందే చంద్రబాబు, జగన్ అంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో అందరూ దమ్మున్నోళ్లమే అన్నారు. కోమటి రెడ్డి సోదరులు దమ్మున్ననేతలని..చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ బానిసలు అంటూ ఎద్దేవా చేశారు. ఈసీ బీజేపీ అడుగుజాడల్లో నడుస్తుందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.


