epaper
Wednesday, March 11, 2026
epaper

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం
తెలంగాణపై టీడీపీ ఎంపీ వ్యాఖ్యలకు చామ‌ల కౌంటర్
ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టవద్దని హెచ్చరిక

కాక‌తీయ‌, భువనగిరి : లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు చేసిన వ్యాఖ్యలను భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటుపై మాట్లాడిన మాటలు సరైనవి కావని ఆయన అన్నారు. లోక్‌సభలో తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని తెలిపారు. ఫిబ్రవరి 14, 2014న జరిగిన పరిణామాలను బ్లాక్ డేగా పేర్కొంటూ నాటి స్పీకర్ మీరా కుమారి తెలంగాణ బిల్లును ఆమోదించడం తప్పు అని చెప్పడం సరికాదని కిరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగబద్ధంగానే లోక్‌సభలో ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మద్దతుగా లేఖ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ విషయం లావు శ్రీకృష్ణ దేవరాయలకు తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. లోక్‌సభలో సుష్మాస్వరాజ్ తెలంగాణకు మద్దతుగా మాట్లాడారని బీజేపీ నాయకులు ఇప్పటికీ చెబుతుంటారని పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ ఎంపీ తెలంగాణపై మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్న సమయంలో ఇప్పుడు తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టడం ఎందుకని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సత్సంబంధాలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఎవరి ప్రసన్నం కోసమో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుగా మాట్లాడితే ఊరుకోమని స్పష్టం చేశారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని కూడా ఆయన సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..!

ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..! కాకతీయ, ఆలేరు : యాదాద్రి భువనగిరి...

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..!

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..! తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభం కాకతీయ, తుంగతుర్తి...

ఘనంగా సూపర్ పాలన దినోత్సవ వేడుకలు

ఘనంగా సూపర్ పాలన దినోత్సవ వేడుకలు విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ కాకతీయ,...

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి ఆదివాసీలపై చర్యలను ఖండించిన సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర...

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కైవసం...

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా..

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. హాలియా, నందికొండ మున్సిపాలిటీల కైవసం హాలియాలో 12లో 11...

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు కలెక్టర్‌, ఎమ్మెల్యే పాత్రల్లో విద్యార్థుల వినూత్న...

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి కార్యకర్తలంతా ఐక్యంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img