కాకతీయ,బయ్యారం: సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయునిగా అందించిన సేవల స్ఫూర్తిని, మననం చేసుకుంటూ, విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు విల్ పవర్ యూత్ అసోసియేషన్ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ముందస్తుగా గురుపూజోత్సవం సందర్బంగా మండలంలోని నర్సాతండ పాఠశాలలో గురువారం ప్రధాన ఉపాధ్యాయులు బావ్ సింగ్, ఉపాధ్యాయులు అరుణ్ కుమార్ అంగన్వాడి ఉపాధ్యక్షురాలు సుమిత్ర లను వారు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విల్ పవర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మంగునాథ్ రాథోడ్, ఉపాధ్యక్షులు గణేష్, కార్యదర్శి సాయికుమార్, శ్రీకాంత్, రవి, వీరన్న, మంగిలాల్, గాంధీ, తండా పెద్దలు, లక్ష్మణ్ నాయక్,మల్సూర్ నాయక్,గ్రామపంచాయతీ కార్యదర్శి శాంత కుమారి,గ్రామపంచాయతీ సిబ్బంది హరి తదితరులు పాల్గొన్నారు.


