టిబీజేఏ ఖమ్మం జిల్లా కెమెరామెన్ నూతన కమిటీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ 4వ మహాసభలు ఖమ్మం వైరా రోడ్డులోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వివిధ ఛానళ్లలో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులతో తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టిబీజేఏ) ఖమ్మం జిల్లా కెమెరామెన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టిబీజేఏ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఫయాజ్, కార్యదర్శిగా గణేష్, కోశాధికారిగా యూసఫ్ షరీఫ్, ఉపాధ్యక్షుడిగా యాకుబ్ పాషా ఎంపికయ్యారు. సహాయ కార్యదర్శిగా శరత్, గౌరవ సలహాదారుగా జాకీర్‌ను ఎన్నుకున్నారు. ఈసీ సభ్యులుగా అర్షద్, హరీష్, రవి, సభ్యులుగా హరిప్రసాద్, శ్రీను, సతీష్, హరి, నరేష్, పాషా, గురు, రాజులను నియమించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వృత్తి విలువలను కాపాడేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.


