కాకతీయ, గుండాల: మండలంలోని శంభునిగూడెం గ్రామంలో మంగళవారం టీబి వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్య శిబిరం టీబి టెక్నీషియన్ సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్లు తెలిపారు.శిబిరం నకు వచ్చిన వారికి బీపి, షుగర్ టెస్టు లు నిర్వహించారు.
అవసరం ఉన్న వారికి ఎక్సరేలు తీయడం జరిగిందని తెలిపారు. శిభబిరంలో50 మంది చిన్న చిన్న అస్వస్థతలకు లోను అయిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో ప్రియాంకా ,జవ్వాజి అరుణకుమారీ,బి. భిక్ష్య ఆశలు . లక్ష్మీ,,వసంత, సూరమ్మ, తదితరులు పాల్గొన్నారు.


