కాకతీయ, కొత్తగూడెం : పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్స్ రీయంబర్స్ మెంట్ బకాయి లు విడుదల చేయాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తలపెట్టిన విద్యాసంస్థల బందుకు సిపిఎం మద్దతు తెలియజేసినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్స్ రీయింబర్స్మెంట్ బకాయులు పెట్టడంతో యాజమాన్యాలతో పాటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలని సూచించిన ఆయన రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి పెండింగ్లో ఉన్న స్కాలర్‌షిప్స్ రీయింబర్స్మెంట్ కూడా విడుదల చేసే బాధ్యత చేపడతామని హామీ ఇచ్చి నేటికీ అధికారంలోకి వచ్చి ఇరవైరెండు నెలలు గడుస్తున్న కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వం సకాలంలో రీయింబర్స్మెంట్ బకాయి విడుదల చేయకపోవడం వలన వెనకబడిన సామాజిక తరగతుల పిల్లలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ యాజమాన్యాల తో చర్చలు జరిపి విడతలవారీగా అయినా రీయింబర్స్మెంట్ విడుదల కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటంలో సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రత్యక్షంగా పోరాటాల్లో పార్కొంటుందని తెలియజేశారు.


