ఆగస్టు 15న కూలీ రిలీజ్..
కాకతీయ, సినిమా : సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం శ్రమిస్తోంది. ఇప్పటికే డేట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కూలీ. ఈచిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, షౌబీన్ షాహీర్, శ్రుతిహసన్ వంటి భారీ తారగణం నటిస్తుండటంతో అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. రజనీకాంత్‌కు జపాన్, మలేషియాతో పాటు అనేక దేశాల్లో భారీగా ఫాలోవర్స్, అభిమానులు ఉన్నారు. ఆగష్టు15న మరో 20 రోజుల్లో థియేటర్లకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన పాటలు సినిమాపై మంచి హైప్ తీసుకు రాగా గత వారం విడుదల చేసి మోనిక సాంగ్ టోటల్ ఇండియానే షేక్ చేస్తుంది.


