ఘనంగా సూపర్ పాలన దినోత్సవ వేడుకలు
విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ
కాకతీయ, తుంగతుర్తి : తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వయం పాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. విద్యార్థుల జీవితంలో చిరకాలం ఇలాంటి గుర్తులు మిగిలిపోతాయని ఇలాంటి పాత్రల ద్వారానే వారు జీవిత లక్ష్యాలను పెట్టుకొని ముందుకు సాగుతారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గాలి ఉషారాణి అన్నారు. ముఖ్యమంత్రిగా మణిదీప్ ఉప ముఖ్యమంత్రిగా యశ్వంత్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కలెక్టర్గా ఇందు ప్రధానోపాధ్యాయురాలుగా చందన పాత్రలను పోషించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అబ్బయ్య ఎలిజబెత్ జమీల్ షరీఫ్ కల్పన నాగయ్య యాదయ్య షాహిదా నివేదిత అవిలేను తదితరులు పాల్గొన్నారు.


