కాకతీయ, జగిత్యాల : శారీరక వ్యాధి బాధతో ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జగిసెట్టి సచిన్ అలియాస్ వినయ్ (24) కొంతకాలంగా వెరికోస్ వేయిన్స్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కానీ వ్యాధి పూర్తిగా నయం కాకపోడంతో మానసికంగా కుంగిపోయిన సచిన్.. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


