గీతా మందిరంలో సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి
త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి హాజరు
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఘన స్వాగతం
కాకతీయ, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని గీతా మందిరంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి విచ్చేయగా, ఆయనకు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఘనంగా స్వాగతం పలికారు. పూర్ణాహుతి అనంతరం జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ఆశీర్వచనం చేయడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.


