విద్యార్థులు పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించుకోవాలి
జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని
గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మెహేంది, ముగ్గుల పోటీలు
కాకతీయ, ఖమ్మం : విద్యార్థులు పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించుకోవాలని గ్రంథాలయాలలో విస్తృతమైన పరిజ్ఞానం కలిగే పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గ్రంథాలయ సేవలు వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని సూచించారు. గ్రంథాలయ వారోత్సవాల ఆరవ రోజు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలని పుస్తకాలు వార్త పత్రికలు చదివి జ్ఞానం పెంచుకోవాలని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీలు, మెహింది పోటీలు నిర్వహించారు. ఖమ్మం నగరం కి చెందిన పలు ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గ్రంథాలయ వారోత్సవాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కరుణ కుమారి, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కేవిఎస్ఎల్ ఎన్ రాజు, సెక్రటరీ ఇమామ్ , గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు జె భాస్కర్ , సిహెచ్ శ్రీనివాస్, ఎస్ లలిత , కుమారి , అఖిల్ , సుమలత , విజయ కుమారి , నాగలక్ష్మి , రవిబాబు , భూక్యా బాబు , రోహిత్ తదితరులు పాల్గొన్నారు.


