తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన
ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు
కలెక్టర్, ఎమ్మెల్యే పాత్రల్లో విద్యార్థుల వినూత్న ప్రదర్శన
కాకతీయ, తుంగతుర్తి: తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించగా, మరికొందరు కలెక్టర్, డీఈవో, ఎమ్మెల్యే, ఎంఈవో పాత్రలు పోషించారు. ఎమ్మెల్యేగా భవ్యశ్రీ, కలెక్టర్‌గా రాజ్యశ్రీ, డీఈవోగా ఆడస పాఠశాలను తనిఖీ చేసిన తీరు ఆకట్టుకుంది. హెచ్‌ఎంగా కార్తీక్ వ్యవహరించగా ఇతర విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలు పోషించారు. కార్యక్రమాన్ని హెచ్‌ఎం వెంకన్న అభినందించారు. ఉపాధ్యాయులు నవీన్, ధనలక్ష్మీ పాల్గొన్నారు.


