స్టేట్ కళా ఉస్తవ్ 2025 సత్త చాటినా గిన్నారపు సేవిత శ్రీ వైష్ణవి
రాష్ట్రస్థాయి పాటల పోటీలలో రెండవ స్థానం కైవశం చేసుకున్న శ్రీ వైష్ణవి
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : స్థానిక పాల్వంచ నవభారత్ స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్ధిని గిన్నారపు సేవిత శ్రీ వైష్ణవి స్టేట్ కళా ఉస్తవ్ సింగింగ్ కాంపిటీషన్ లో ద్వితీయ స్థానం కైవశం చేసుకుంది. గత నెలలో కొత్తగూడెం క్లబ్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉస్తవ్ సింగింగ్ కాంపిటీషన్ లో మొదటి స్థానం కైవశం చేసుకొని స్టేట్ కళా ఉస్తవ్ కి ఎంపిక అయ్యింది . గురువారం హైదరాబాద్ లో వేదికగా రాజేంద్రనగర్ లో జరిగిన కళా ఉస్తవ్ సింగింగ్ కాంపిటీషన్ లో సేవిత శ్రీ వైష్ణవి ద్వితీయ స్థానం గెలుచుకొని అందరి ప్రశంశలు అందుకొని స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ డాక్టర్ నవీన్ నికోలస్, రాధ రెడ్డి చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకున్నరు ఇట్టి కార్యక్రమములో తల్లితండ్రులు గిన్నారపు నాగేందర్,అంబికా మాట్లాడుతూ వైష్ణవి స్టేట్ లెవల్ లో ద్వితీయ స్థానం సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉంది తన కూతురు సింగింగ్ లో మాత్రమే కాదు చదువు లో కూడా ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది రాబోవు రోజుల్లో అన్ని రంగాల్లో అత్యుత్తమ స్థానం సంపాదించుకోవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు, నవభారత్ స్కూల్ యాజమాన్యం ప్రశంలు తెలిపి అభినందించారు వైష్ణవి ఈ ఘనత సాధించడం చాలా గర్వకారణం విద్యార్ధిని విద్యార్ధులకు వైష్ణవి స్పృతిగా నిలిచిందని రాబోవురోజుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు


