epaper
Sunday, March 1, 2026
epaper

ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు నిరంతరం ఇవ్వాలి

ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు నిరంతరం ఇవ్వాలి
వారబంది విధానంతో చివరి ఆయకట్టుకు నష్టం
చివరి దశలో పంటలు ఎండిపోయే ప్రమాదం
ధాన్యం బోనస్ చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం
బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య

కాకతీయ, తుంగతుర్తి : యాసంగి పంటకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల ద్వారా వారబంది పద్ధతి కాకుండా కనీసం నెల రోజులపాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. తుంగతుర్తిలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.యాసంగి సాగు పూర్తిగా కాల్వలపై ఆధారపడి ఉన్న రైతులకు మొదటి నుంచే వారబంది విధానంలో నీళ్లు విడుదల చేస్తే చివరి కాల్వల వరకు నీరు చేరడం కష్టమని తెలిపారు. చివరి ఆయకట్టు రైతుల పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. యాసంగి పంట చివరి దశకు చేరుకున్న సమయంలో నీటి కొరత ఏర్పడితే పంట పూర్తిగా నష్టపోతుందని అన్నారు.
కనీసం ఒక నెల రోజులపాటు నిరంతరం నీళ్లు విడుదల చేసి, ఆ తర్వాతే వారబంది అమలు చేస్తేనే పంట చేతికొస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే వెంటనే అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని కోరారు.

చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయం

చివరి కాల్వలపై ఆధారపడి ఉన్న రైతులు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా సాగు చేశారని, నీరు అందకపోతే వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి దశలో పంటలు ఎండిపోతే రైతులకు తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. ఐకేపీ కేంద్రాల ద్వారా సన్న ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం నెల రోజులు దాటినా రైతులకు బోనస్ డబ్బులు చెల్లించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. సంబంధిత మంత్రి ప్రకటించిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల్లో ఏడాదికి తొమ్మిది నెలల పాటు నీళ్లు నిండుగా పారేవని, రైతులు నీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేదే కాదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా రైతాంగం నీటి సమస్యలు, బోనస్ ఆలస్యం, పంట నష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు కొండగడుపుల నాగయ్య, గుగులోతు వీరోజీ, నాయకులు గోపగాని వెంకన్న, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి ఆదివాసీలపై చర్యలను ఖండించిన సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర...

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కైవసం...

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా..

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. హాలియా, నందికొండ మున్సిపాలిటీల కైవసం హాలియాలో 12లో 11...

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు కలెక్టర్‌, ఎమ్మెల్యే పాత్రల్లో విద్యార్థుల వినూత్న...

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి కార్యకర్తలంతా ఐక్యంగా...

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌రెడ్డి...

రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్ర‌తిభ

రాష్ట్ర స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్ర‌తిభ కాకతీయ, తుంగతుర్తి : తెలంగాణ క్రీడ...

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టివేత‌ ఇంటిలో, కార్యాలయంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img