కాకతీయ, కొత్తగూడెం భద్రాద్రి: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం సందర్భంగా ఆరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీ కోదండరామ స్వామి భద్రాద్రి ఆలయం మూసి వేయడం జరుగుతుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి దామోదర్ రావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8 తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ సంప్రోక్షణ, ఆరాధన, శుద్ధి, సేవా కాలం అనంతరం ఉదయం 7.30 గంటలకు భక్తులకు స్వామి వారి ధర్శనకార్యక్రమం,సుప్రభాత ధర్శనాలు జరుపుతారని తెలిపారు. కావున భక్తుల అసౌకర్యానికి మన్నించాలని కోరారు.



