epaper
Monday, March 2, 2026
epaper

క్రీడాస్ఫూర్తే అసలైన విజయం!

క్రీడాస్ఫూర్తే అసలైన విజయం!
కబడ్డీ మన సంప్రదాయ క్రీడ
క్రీడలు–యువజన సేవల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి
గెలుపు–ఓటములు సహజమే : మంత్రి సీత‌క్క‌
ఘ‌నంగా అండర్–17 జాతీయ కబడ్డీ పోటీలు ఆరంభం
గిరిజన ప్రాంతంలో చరిత్ర సృష్టించిన ఏడూళ్ల‌ బయ్యారం
దేశవ్యాప్తంగా మారుమోగనున్న గ్రామ పేరు

కాకతీయ, కొత్తగూడెం : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమేనని… క్రీడాస్ఫూర్తే ముఖ్యమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు–యువజన సేవల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో బుధవారం 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ ఈ క్రీడా సంభరం చూస్తే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లు ఉందని అన్నారు. కబడ్డీ మన దేశంలో పుట్టిన సంప్రదాయ క్రీడ అని, మన మట్టిలో పుట్టిన ఆటలు మన సంస్కృతి సువాసనను ప్రపంచానికి చాటుతాయని పేర్కొన్నారు. చెమటతో, శ్రమతో ఆడే ఈ ఆటలో గెలుపు–ఓటములు సహజమని ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మారుమూల గిరిజన ప్రాంతమైన ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ పోటీలతో బయ్యారం గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని తెలిపారు. వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత్–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా “గెలుపు–ఓటములకన్నా మనసులు గెలుచుకుని రావాలి” అన్న సందేశాన్ని గుర్తు చేస్తూ… బయ్యారానికి వచ్చిన క్రీడాకారులు కూడా ఇక్కడి ప్రజల మనసులు గెలుచుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు.

గెలుపు–ఓటములే జీవిత పాఠాలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ… గెలుపులో ఆనందాన్ని, ఓటమిలో పాఠాలను జీవితానికి మార్గదర్శకంగా మలచుకోవాలని సూచించారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ బాధ్యత తీసుకున్న కంది చారిటబుల్ ట్రస్ట్, సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆరు నెలల పాటు శ్రమించి ఏర్పాట్ల నుంచి ఆతిథ్యం వరకు సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… గ్రామీణ స్థాయిలో యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ తరహా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించామని, అదే విధంగా జాతీయస్థాయి పోటీలను కూడా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులకు ఈ పోటీలు మరచిపోలేని అనుభవంగా నిలుస్తాయని, జిల్లా ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటిడిఏ పీఓ రాహుల్, విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి, టోర్నమెంట్ అబ్జర్వర్ నిర్మల్ జంగ్డే, సర్పంచ్ చందర్రావు, కంది చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారెడ్డి, విశ్వభరత్ రెడ్డి, తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, క్రీడా–విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img