సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం : సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం సమ్మక్క-సారలమ్మ గద్దెలను శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించి దర్శించుకున్నారు. గద్దెల దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు. అక్కడ విధులలో ఉన్న అధికారులు సిబ్బందికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి వెంకన్నబాబు, సిఐలు సత్యనారాయణ, సురేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


