కాకతీయ, తుంగతుర్తి : నిషేధిత వస్తువులను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ క్రాంతికుమార్ అన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం చేపట్టిన నాకా బందీ కార్యక్రమంలో భాగంగా బండ రామారం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడం మెరుగైన సేవలు అందించడంలో పోలీసులు వ్యవస్థ ముందుంటుంది అన్నారు. గంజాయి ,నాటుసార, పశువులు రవాణా తో పాటు పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు. మైనర్లకు వాహనాలను ఇస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


