సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధం
రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
కాకతీయ, కొత్తగూడెం: సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పలు ప్రాంతాల్లో సామాజిక వర్గాలు నిర్వహించిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని పాపారావు మామిడి తోటలో భద్రాద్రి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక వనసమారాధనలు మనసంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను కుటుంబ బంధాల అనురాగాన్ని దృఢపరుస్తాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేసినప్పుడే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. భద్రాద్రి రెడ్డి సంఘం సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్తీక మాస వనమహోత్సవం కార్యక్రమంలో రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టం మాధవరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షుడు లెల్ల వెంకట్ రెడ్డి, గౌరవ సలహాదారు మేరెడ్డి జనార్దన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ ఎర్రమల శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ కాసాని శ్రీనివాస్ రెడ్డి, సంఘం నాయకులు మన్నెం జవహర్ రెడ్డి, పైడిమల్ల శ్రీనివాస్ రెడ్డి, రెడ్డెం తులసి రెడ్డి, అన్నపురెడ్డి సుందర్ రెడ్డి, ముప్పాని సోమిరెడ్డి, రాంరెడ్డి నరేందర్ రెడ్డి, విప్లవరెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు.


