బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతం ఆలాపన
కొత్తగూడెం రూరల్ కాకతీయ : కొత్తగూడెం 1875 నవంబర్ 7న బంకిమ్‌చంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠ్’ నవలలో మొదటిసారిగా పొందుపరచబడిన వందేమాతరం గీతం నేటితో 150 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు లైబ్రరీ హాల్లో సమిష్టిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ —
వందేమాతరం గీతం భారత జాతి ఆత్మను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ గీతం మనలో దేశభక్తి భావాన్ని నింపి, దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరింపజేస్తుందనీ ప్రతి భారతీయుడి హృదయంలో వందేమాతరం స్ఫూర్తి శాశ్వతంగా నిలవాలి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జే. గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కార్యవర్గ సభ్యులు కాసాని రమేష్, మాలోత్ ప్రసాద్, ఉప్పు అరుణ్, అడపాల పార్వతి, కే. చిన్నికృష్ణ, సీనియర్ , జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


