భక్తులతో పోటెత్తిన శివాలయాలు
కాకతీయ,మణుగూరు : మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి.గురువారం మండలంలోని సీతంపేట రాజరాజేశ్వరి శివాలయం, చింతల బయ్యారం నీల కంటేశ్వర స్వామి,మణుగూరులోని శ్రీ శ్రీ నీలకంటేశ్వర స్వామిదేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున లేచి పవిత్ర గోదావరిలో స్నానమాచరించి మహా శివుని దర్శించుకున్నారు. కాకతీయులకాలం నాటి మణుగూరు లోని శ్రీ శ్రీ నీలకంటేశ్వర శివాలయంలోని తెల్లవారుజామున నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అత్యంత వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి పర్వదినాన రాత్రి శివపార్వ తుల కళ్యాణం జరుగుతుందని స్వామివారి కల్యాణం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనున్న సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.




