కాకతీయ, క్రైమ్ డెస్క్: అత్యాచారం కేసులో నల్లగొండ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాలికపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 50ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇంచార్జీ జడ్జి రోజారమణి తీర్పు చెప్పారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డడన్న ఆరోపణలపై 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై పోక్సో చట్టం కేసు నమోదు అయ్యింది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగాయి. తాజాగా నేడు తీర్పు వెల్లడయ్యింది.
అత్యాచారం కేసులో నల్లగొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


