పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సెమీ క్రిస్మస్ సందడి
మతసామరస్యంతో శాంతి సందేశం ఇవ్వాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ (హేమచంద్రపురం)లో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, క్రిస్మస్ ఆత్మీయతను చాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ… క్రిస్మస్ అనేది ఏసుక్రీస్తు జననాన్ని స్మరించుకునే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ ప్రేమ, క్షమ, మానవత్వ సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో మతసామరస్యాన్ని కాపాడుతూ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
కేక్ కటింగ్‌తో పండుగ ఆనందం
అనంతరం సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును జిల్లా ఎస్పీ కట్ చేసి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు కార్యాలయాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) అవినాష్ కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఐలు సుధాకర్, నరసింహారావు, కృష్ణారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


