9 నుంచి సెక్షన్ 163 అమలు
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునిల్ దత్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఈ నెల 11 నుంచి నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత పోలింగ్ జరిగే కొణిజర్ల, రఘునాథపాలెం, బోనకల్లు, వైరా, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీన ఓట్ల లెక్కింపు , ఫలితాలు ప్రకటించే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని సూచించారు. అదేవిధంగా ఎవరూ రెచ్చ గొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం చేయరాదని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా/అతిక్రమించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడైనా డబ్బు, మద్యం ఉచిత కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయకూడదని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు / ఫారెస్ట్/ కేంద్ర బలగాలు హోంగార్డులు మరియు ఎస్ పి ఓలకు నిషేధ అంక్షాలు నుంచి మినహాయింపు వుంటుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. ఎన్నికలలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ… పారదర్శక ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని అన్నారు.పోలింగ్ సందర్భంగా ఓటర్లకు భద్రత రీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైన డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.


