కాకతీయ, భద్రాద్రికొత్తగూడెం : గోదావరి నదికి ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు, పైనున్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు తరలి వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈనెల 29న సాయంత్రం 7.22గంటలకు గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఈనెల 30న సాయంత్రం 5గంటలకు 46.00 అడుగులు ఉన్న గోదావరి రాత్రి 10గంటలకు రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో 47.20 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తున్నది. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్ 4 గేట్లు ఓపెన్ చేసి 7613 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఎటువంటి ప్రాణ నష్టం, జరుగకుండా అధికారులు ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు,హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


