పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి.
నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల లక్ష్యం
జూలూరుపాడులో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల పర్యటన
కాకతీయ, జూలూరుపాడు: రాష్ట్ర విద్యాశాఖ అధికారుల బృందం మండలం సందర్శించారు.రాష్ట్ర విద్యాశాఖ పరిశీలికరాలు,జాయింట్ డైరెక్టర్ కె వెంకట నరసమ్మ మరియు వారి బృందం మండల కేంద్రంలోనీ భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల, పడమటి నర్సాపురం ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్శించారు పరిశీలన బృందం మాట్లాడుతూ ప్రభుత్వం 5.0 స్పెషల్ క్యాంపియన్ లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రంగా,పచ్చదనం, మరుగుదొడ్లు,పాఠశాల ఆవరణము, తరగతి గదులు, ఆఫీసు రూములు, పాఠశాల మొత్తం కూడా పరిశుభ్రంతో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతోటి 5.0 అనే స్పెషల్ క్యాంపియన్ ఏర్పాటు చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను సందర్శించడం జరిగిందని అన్నారు అదేవిధంగా పాఠశాలలో పనికిరాని,ఉపయోగపడని వస్తువులను వెంటనే తొలగించాలని,తర్వాత రెండు రోజుల్లో అవన్నీ కూడా పరిశుభ్రంగా చేయాలని సూచించడం జరిగినది పడమటి నర్సాపురం ఉన్నత పాఠశాల నందు రేపు మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను ఏర్పాటు చేయవలసిందిగా సూచించడం జరిగినది.ఈ సందర్శనలో ఎ.ఎ. ఓ నాగ రాజశేఖర్, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్,భద్రాద్రి కొత్తగూడెం విద్యాశాఖ కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఎస్కే సైదులు,మండల నోడల్ ఆఫీసర్ పి సంజీవరావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీ నరసయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి నేతాజీ, సీతారాములు,జిదుల మహేష్, ధరావత్ నవనీత, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.


