కాకతీయ, కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని రెండోటౌన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ ను సోమవారం అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తో పాటు మిత్ర బృందం మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. బడుగు బలహీన వర్గాల సమస్యల గురించి చర్చించి వినతిపత్రం అందజేశారు. శివకుమార్ మాట్లాడుతూ తరాలు మారినా అంతరాలు మారడం లేదని వాపోయారు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు పేదవర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో గానీ, వడ్డీ వ్యాపారస్తుల ధన దాహపు కోరల్లో నుండి విముక్తి కలిగించి ఆయా కేసుల్లో వారికి న్యాయం చేయాలని వాటిని న్యాయపరంగా సత్వరమే పరిష్కరించాలని సీఐ ప్రతాప్ కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గాంధీ పథం జిల్లా కన్వీనర్ చింతలచెరువు గిరీశం, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


