మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి
‘విద్యే విముక్తి’ స్ఫూర్తితో బీఆర్ఎస్ పాలన
కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ
సావిత్రి బాయి పూలేకు ఘన నివాళి
కాకతీయ, రఘునాథపాలెం : దళిత–బహుజన స్త్రీల జనోద్ధరణకు, మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయి సావిత్రిబాయి పూలే జయంతిని ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. గౌరవ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నగర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ మాట్లాడుతూ… సమాజం మహిళలు చదవకూడదని, ప్రశ్నించకూడదని ఆంక్షలు విధించిన కాలంలో ఆ అవమానాలను ధైర్యంగా ఎదుర్కొని బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించిన తొలి విప్లవ మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. నేటి మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వానికి ఆమె వేసిన పునాదులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. ‘విద్యే విముక్తి’ అనే సావిత్రిబాయి సిద్ధాంతాన్ని తెలంగాణ ఉద్యమ నాయకుడు, ప్రజానాయకుడు కేసీఆర్ పాలనలో ఆచరణలోకి తీసుకువచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీగా బీఆర్ఎస్ నిలిచిందన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తూ మహిళల గౌరవం, హక్కులు, విద్య కోసం నిరంతరం పోరాడటం తమ బాధ్యత అని, ఆమె జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆమె ఆదర్శాలను జీవితాల్లో ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బుల్, కార్పొరేటర్లు తోట గోవిందమ్మ రామారావు, శీలంశెట్టి రామ వీరభద్రం, బుడిగం శ్రీనివాస్, నాగండ్ల కోటి, బుర్రి వెంకట్, కూరాకుల వలరాజు, పల్లా రోస్‌లీనా, డాదే అమృత, బిక్కసాని ప్రశాంతి జస్వంత్, జ్యోతి రెడ్డి, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, ధోన్‌వాన్ సరస్వతి రవి, గోళ్ళ చంద్రకళ వెంకట్, తోట ఉమారాణి వీరభద్రం, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత సహాయకుడు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


