- ఎమ్మెల్యే కూనంనేని
కాకతీయ, జూలూరుపాడు: సీపీఐ మండల సీనియర్ నాయకుడు వల్లపిన్నీ సత్యనారాయణ ఇటీవల మరణించారు. ఆయన దశదిన కార్యక్రమానికి సోమవారం కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై సత్యనారాయణ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతర కూనంనేని మాట్లాడుతూ వలపిన్ని మరణం చాలా బాధాకరమని, ఆయన పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామన్నారు. బాధిత కుటుంబానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సీపీఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు ఎస్కె నాగుల మీరా, యలంకి మధు, సిరిపురపు వెంకటేశ్వర్లు, యాస రోశయ్య గుండె పిన్ని మధు, గార్లపాటి వీరభద్రం, సొసైటీ మాజీ చైర్మన్ పొలదాసు కృష్ణమూర్తి, కాంగ్రెస్ నాయకులు నున్న కృష్ణయ్య, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.


