epaper
Friday, April 17, 2026
epaper

అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్న సర్పంచ్

అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్న సర్పంచ్
*జేసీబీ,మూడు ట్రాక్టర్లు సీజ్
*నలుగురిపై కేసు నమోదు
*తప్పుడు ప్రచారాన్ని ఖండించిన గీసుగొండ సీఐ విశ్వేశ్వర్

కాకతీయ, గీసుగొండ: కొమ్మాల జాతర అభివృద్ధి పనుల నెపంతో సూర్య తండా గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కట్ట నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక సర్పంచ్ రాఘవేంద్ర అప్రమత్తంగా వ్యవహరించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది.జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి మూడు ట్రాక్టర్లలో తరలిస్తున్న వారిని సర్పంచ్ నిలదీశారు. ఎవరి అనుమతితో మట్టి తరలిస్తున్నారని ప్రశ్నించగా, సీఐ అనుమతితోనే మట్టి రవాణా చేస్తున్నామని నిర్వాహకులు బుకాయించినట్లు సమాచారం.దీనిపై సర్పంచ్ రాఘవేంద్ర గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న సీఐ డి.విశ్వేశ్వర్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే మట్టి తవ్వి తరలిస్తున్నట్లు నిర్ధారించి ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేశారు.

అక్రమంగా మట్టి తరలిస్తూ అరెస్ట్ అయిన నిర్వాహకులు

*మట్టి తరలింపుకు పోలీస్ శాఖకు సంబంధం లేదు…
పోలీస్ శాఖ అనుమతులు పొంది మట్టి రవాణా చేస్తున్నట్టుగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని,అందులో ఎటువంటి నిజం లేదని గీసుగొండ సిఐ విశ్వేశ్వర్ స్పష్టం చేశారు. మట్టి తవ్వకం, రవాణాకు సంబంధిత రెవెన్యూ, గనుల శాఖల అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. అక్రమ మట్టి తరలింపులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.ఈ ఘటనలో బుక్క వేణు, నాయనబోయిన రాజు, తుత్తురు రవి, బూర్గుల కొమురయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మృతుడి కుటుంబానికి స్నేహితుల సాయం

మృతుడి కుటుంబానికి స్నేహితుల సాయం కాకతీయ, ఆత్మకూరు : చిన్ననాటి స్నేహితులకు కష్ట...

హిందూ ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

హిందూ ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి సమితి అధ్యక్షుడు పేరం గోపికృష్ణ పిలుపు కాకతీయ,...

ఉద్యమకారుల సదస్సు విజయవంతం చేయాలి

ఉద్యమకారుల సదస్సు విజయవంతం చేయాలి ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు లింగమూర్తి కాకతీయ,చెన్నారావుపేట :...

మోదీ హఠావో కిసాన్‌కో బచావో

మోదీ హఠావో కిసాన్‌కో బచావో యూత్ కాంగ్రెస్ మహాధర్నాకు భారీగా తరలిరండి కాంగ్రెస్ వ‌రంగ‌ల్...

డీలిమిటేష‌న్‌లో అన్యాయం జ‌రిగితే ఊరుకోం

డీలిమిటేష‌న్‌లో అన్యాయం జ‌రిగితే ఊరుకోం టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి కాకతీయ, నెక్కొండ :...

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి

సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల...

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత...

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి

జాన్‌పాక‌, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img