నవభారత నిర్మాణం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్
యూనిటీ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన….జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : నవభారత నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన అడుగుజాడలలో ప్రతి ఒక్కరు పయనించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే స్టేషన్ ఆవరణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఖమ్మం సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సర్దార్ వల్లభాయ్ పటేల్, భరతమాత చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించి, ఐక్యత పాదయాత్ర ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశంలో స్వేచ్ఛ కోసం తపించేవారని, ఎన్ని భాషలు మాట్లాడిన ఎన్ని ప్రాంతాలు ఉన్న మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. భారత దేశ ప్రజల్ని చైతన్యపరిచి ఏకతాటిపై నడిపించిన మహనీయుడని కొనియాడారు. ప్రజలు ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రతి పౌరుడు దేశీయ ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని, దేశానికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిచే ఐక్యత(ఆత్మ నిర్భర్భారత్) ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి.షేక్ అబ్దుల్ రెహ్మాన్, డి.వై.స్.ఓ పరంధామ రెడ్డి, ఎన్.సి.సి నయీబ్ సుబేదార్ లక్ష్మణ్, జిల్లా ఎన్.ఎస్.ఎస్ కన్వీనర్ డా.వేముల కామేశ్వరరావు, ఇడి కాలేజీ ప్రిన్సిపాల్ పి.పద్మ, మేరా యువభారత్ ఖమ్మం జిల్లా ఎకౌంట్స్ మరియు ప్రోగ్రాం ఆఫీసర్ కె. భాను చందర్, కన్వీనర్ పి.భిక్షపతి,కో-కన్వీనర్ బి.గోపికృష్ణ, బి.ప్రభాకర్ రెడ్డి జాగృతి యూత్ అసోసియేషన్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్ మహిళా సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


