అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం
నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం
ఓవర్‌టేక్ ప్రయత్నంలో గోతిలో పడిన వాహనం
మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
కాకతీయ/చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి రహదారి పక్కనున్న గోతిలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు బోనకల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.


