కాకతీయ, బిజినెస్ డెస్క్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ శాంసంగ్ భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన Samsung Galaxy M07 ఫోన్ కేవలం రూ. 6,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో ఉన్నా కూడా ఈ ఫోన్‌లో అందించిన ఫీచర్లు మిడ్‌రేంజ్ ఫోన్లకు ఏమాత్రం తీసిపోవని చెప్పాలి. ఈ ఫోన్‌లో MediaTek Helio G99 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, అలాగే తాజా Android 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి.
ప్రస్తుతం Galaxy M07 ఒకే వేరియంట్‌లో 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో మార్కెట్లో లభిస్తోంది. దీని ధరను శాంసంగ్ కేవలం రూ. 6,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో మూడు నెలలపాటు నో-కాస్ట్ EMI ఆఫర్ను కూడా వినియోగదారులకు అందిస్తున్నారు.
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునేవారికి శాంసంగ్ గెలాక్సీ ఎం07 బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. శాంసంగ్ బ్రాండ్ విశ్వసనీయతతో పాటు, దీని కెమెరా పనితీరు, బ్యాటరీ బ్యాకప్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. తక్కువ బడ్జెట్‌లో అత్యుత్తమ పనితీరును కోరుకునే యూజర్ల కోసం గెలాక్సీ M07 ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M07 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని ఒకసారి పరిశీలిస్తే..
* 6.7 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే
* 720 x 1600 పిక్సల్స్ రిజల్యూషన్
* 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్
* మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్
* వన్ యూఐ 7 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం
* 4 జీబీ ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్
* వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్
* ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
* 4జీ నెట్ వర్క్ సపోర్ట్
* యూఎస్బీ టైప్-సీ పోర్ట్
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
* వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్
* ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
* 4జీ నెట్ వర్క్ సపోర్ట్
* యూఎస్బీ టైప్-సీ పోర్ట్
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ


