కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన కార్యకర్తలకు పాదాభివందనాలు
తుమ్మల యుగేందర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రఘునాధపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో గెలవడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారకులైన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తుమ్మల నాగేశ్వరరావు అభిమానులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలో ఆయా గ్రామాల్లో పనిచేసిన ప్రతి పంచాయతీ ఇన్చార్జిలు కూడా ఆయన తన అభినందనలు తెలియజేశారు. రాజకీయాల్లో ఉన్నాము అంటే అది ప్రజల అభిమానమేనని ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని సమీక్షించుకొని ముందుకు వెళదామని కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని ఎన్నికల తర్వాత ప్రతి వ్యక్తి, ప్రతి వ్యవస్థ ఆ గ్రామాల అభివృద్ధి చెందటం పైనే దృష్టి సారించాలని మీరు చూపించిన ప్రేమను, అనురాగాలు నా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు అని, ఏది ఏమైనా ఆ మండలంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటం చాలా ఆనందంగా ఉన్నది అని, భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు* గారి సారధ్యంలో కొత్త సర్పంచులు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఎన్నికైన కొత్త సర్పంచులకు కాంగ్రెస్ వార్డు మెంబర్లకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ తన అభినందనలు తెలిపారు


