స్టాండింగ్ కౌన్సిల్‌గా సాయిని మల్లేశం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి న్యాయపరంగా సమర్థ సేవలు అందిస్తానని చెప్పారు.


