epaper
Monday, December 1, 2025
epaper

ఖమ్మం డిపో ఎదుట రూ. 2 కోట్ల స్థలానికి ఎసరు

ఖమ్మం డిపో ఎదుట రూ. 2 కోట్ల స్థలానికి ఎసరు
అడ్డుకున్న యూనియన్ నేతలు, విశ్రాంత ఉద్యోగులు
సంఘీభావంగా ఇతర యూనియన్ నేతలు
అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేసి, ఆ ఇద్దరిని అరెస్ట్ చేయాలి
ఆర్టీసీ డిపో వద్ద భారీ నిరసన
భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలంటే ఆర్టీసీ బిడ్డలందరు ముందుకు రావాలి

కాకతీయ, ఖమ్మం: ఆర్టీసీ కార్మికుల విరాళాలతో కొనుగోలు చేసిన భవనాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రూ. రెండు కోట్ల రూపాయల విలువ చేసే భూమి ని కాపాడేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయు యూనియన్ నేతలు, విశ్రాంత ఉద్యోగులు శనివారం ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీలోని ఇతర సంఘ నేతల సైతం వీరికి సంఘీభావంగా నిరసన పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2002 కార్మికులకు, యూనియన్ నాయకులకు, ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉండాలని ఖమ్మం డిపో ఎదుట 350 గజాల భవనాన్ని యూనియన్ పేరిట కొనుగోలు చేశారు. నాటి నుంచి ఓ గదిలో యూనియన్ ఆఫీస్ కొనసాగుతుంది. యూనియన్ లోని ఇద్దరు నాయకులు (విశ్రాంత ఉద్యోగులు) అజయ్ కుమార్ ఎల్ ఆర్ కే రావు సుమారు 210 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యూనియన్ నేతలు వారిపై న్యాయపోరాటం చేస్తూనే తాజాగా వారు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వారు ఆందోళన చేపట్టారు. ఎన్ఎంయు రీజినల్ సెక్రటరీ ఆర్ వి వీరభద్రం, నాయకులు ఆర్ఎస్ రామారావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ పాండురంగారావు, ఎన్ ఎమ్ యు మాజీ రీజనల్ సెక్రటరీ, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ వీ చక్రధర్ రావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ రీజినల్ ప్రెసిడెంట్ బివి రావు తదితరులు మాట్లాడారు. ఖమ్మం భవన అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ ఆఫీస్ అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. కార్మిక యూనియన్ ద్రోహులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక విరాళాలతో నిర్మించుకున్న ఆఫీసును అక్రమార్కుల నుంచి కాపాడాలన్నారు. యూనియన్ ఆఫీస్ ను అక్రమంగా తన బంధువు బుచ్చి రామారావు పేరుతో , కోర్టు వివాదాల ఉండగా తన కూతురు హర్ష చౌదరి పేరుతో రిజిస్టర్ చేయించుకున్న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ రీజినల్ కార్యదర్శిగా ఉండి అక్రమంగా ఆఫీసును తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎల్ ఆర్ కె రావు కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్, ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి

పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి పార్టీ నేత‌ల‌కు కాంగ్రెస్ ఖ‌మ్మం న‌గ‌ర అధ్య‌క్షుడు...

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ :...

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా “ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ”

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా "ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ" ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలి అధికారులు...

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కాలరీస్...

మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం

మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి...

సంఘంపై ఆరోపణలను ఖండిస్తున్నాం

సంఘంపై ఆరోపణలను ఖండిస్తున్నాం రాష్ట్ర నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ సెక్రెటరీ ఎల్....

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత సింగరేణి చైర్మన్ బలరాం గెలుపొందిన విజేతలకు బహుమతులు విజయవంతంగా...

కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు

కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు ముగిసిన కోల్ ఇండియా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img