యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టాలి
కాకతీయ, తుంగతుర్తి : మండల కేంద్రంలో కోర్టు నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు రోడ్డు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ స్థానికులతో కలిసి సోమవారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంబంధిత కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో దుమ్ము, ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కటకం సూరయ్య, షేక్. జాన్ సార్, బత్తుల జలేంధర్, కొండ రాజు, స్థానికులు ప్రతాప్, సోమయ్య, సుధాకర్, స్థానిక మహిళలు పాల్గొన్నారు.


