కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో సుమారు 220 అనధికార హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, ప్రచార బోర్డులు తొలగించారు. పాదచారుల రాకపోకలకు ఆటంకం రాకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, నగర శుభ్రత, అందాన్ని కాపాడేందుకు ఈ చర్య చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఇకముందు మున్సిపల్ అనుమతి లేకుండా ఫుట్‌పాత్‌లు, రహదారులు, జంక్షన్‌లు లేదా ప్రజా ప్రదేశాల్లో ఏవైనా హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే తక్షణమే తొలగించడమే కాక, జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు నగర అందం, శుభ్రత కాపాడడంలో భాగస్వాములు కావాలని, ఎక్కడైనా అనధికార హోర్డింగ్‌లు కనిపించిన పక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీకే)కు ఫిర్యాదు చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు


