నూతన సర్పంచులకు ఎర్రబెల్లి సన్మానం
కాకతీయ, తొర్రూరు : తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన నూతన సర్పంచ్‌గా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌తో పాటు వార్డ్ మెంబర్లను ఆయన సన్మానించారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలను అభినందిస్తూ, గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సోషల్ మీడియా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


