సర్పంచ్‌గా రవికుమార్ గౌడ్ గెలుపే గ్రామ అభివృద్ధికి మార్గం
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం పరిధిలోని కొరపల్లి గ్రామ ప్రజలు, పల్లె కుటుంబ సేవలను కొనియాడుతూ, పల్లె రవికుమార్ గౌడ్‌ను సర్పంచ్‌గా గెలిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పల్లె ప్రభాకర్ గౌడ్ నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం, గ్రామ అభివృద్ధి, విద్యార్థులు, ఆలయాలు, ఇతర సేవా కార్యక్రమాలకు సహాయం చేయడం ద్వారా గ్రామస్తుల విశ్వాసాన్ని పొందారు. అదే కుటుంబం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవికుమార్ గౌడ్‌ను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామాన్ని ఇంతవరకు నడిపిన కొందరు నాయకులు స్వార్థపరిష్కారాలతో మాత్రమే శ్రద్ధ చూపారని, నిస్వార్థంగా పేదలకు సహాయం చేసిన పల్లె కుటుంబమే కొరపల్లిని ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దగలదని వారు విశ్వసించారు. అందువల్ల ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేస్తూ రవికుమార్ గౌడ్‌ను గెలిపిస్తామని చెప్పారు.


