రాజేష్‌కు సాహిత్య సేవా రత్న పురస్కారం
భద్రాచలంలో ఘనంగా అవార్డు ప్రదానం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలుగు కళా రత్నాలు ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల సాహిత్య–సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ కవి రాజేష్‌కు విశిష్ఠ సాహిత్య సేవా రత్న పురస్కారం ప్రదానం చేశారు. ఈ అవార్డును ప్రముఖ సాహితీవేత్త, తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తాళ్లూరి పంచాక్షరయ్యతో పాటు విద్యావేత్త సిద్ధులు, పాకాల దుర్గాప్రసాద్, డా. గోళ్ల భూపతిరావు, సంస్థ అధ్యక్షులు డా. యు.వి. రత్నం, డా. ఉషారాణి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరచడంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అనంతరం రాజేష్ ఆలపించిన గజల్స్ సభికులను విశేషంగా అలరించాయి. గజల్ రాజేష్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కూచిపూడి, జానపద నృత్యాలు, గీతాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


