చేర్యాలలో ఈదురు గాలులతో వర్షం
* చిరు వ్యాపారస్తులకు తప్పని తిప్పలు
కాకతీయ,చేర్యాల: మేఘాలు ఒక్కసారిగా కమ్ముకుని గాలి వేగం పెరగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.చేర్యాల తో పాటు పలు గ్రామాల్లో కొద్దిసేపు కురిసిన వర్షానికి రహదారులపై మంచు పొరలా కనిపించింది. గాలి, ఈదురు గాలులతో కురిసిన వర్షానికి చిరు వ్యాపారస్తులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనగా, కొంతమేర మొక్కజొన్న,మిరప తదితర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీగా ఈదురు గాలులు రాగ పలు గ్రామాల్లో వృక్షాలు విరగగా, మరికొన్ని గ్రామంలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఈ దృశ్యాలను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం సుమారు గంట పాటు కురిసిన వర్షానికి చేర్యాల రహదారులు చెరువులను తలపించాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చేర్యాల గాంధీ సెంటర్, అంగడి బజార్ సెంటర్లో వర్షం నీరు నిల్వడం వల్ల వాహనదారులు,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



