పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే నేతృత్వంలో నివాళులర్పణ
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్యసాయి బాబా చిత్రపటానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యసాయి బాబా ప్రేమ, శాంతి, సేవా సందేశాలతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. సమాజ సేవే జీవసాఫల్యమనే భావాన్ని ఆయన జీవితంలో ఆచరణలో చూపించారని ఎస్పీ అన్నారు.కార్యక్రమంలో ఆర్‌ఐలైన మధుకర్, యాదగిరి, ఎస్‌ఐ కిరణ్‌కుమార్, అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


