కాకతీయ, తెలంగాణ బ్యూరో: తరగతి గదిలో అల్లరి చేస్తోందని విద్యార్థిని టీచర్ కొట్టడంతో ఆమె తలకు బలమైన గాయమై ఆసుపత్రి పాలయ్యింది. ఆసుపత్రిలో స్కానింగ్ చేస్తే ఆమె పుర్రె చిట్లిందని తేలింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పుంగనూరు పట్టణానికి చెందిన హరి, విజేత కూతురు 11 ఏళ్ల సాత్విక నాగశ్రీ స్థానికంగా భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతోంది.
ఈనెల 10న క్లాస్ రూంలో సాత్విక అల్లరి చేస్తోందని ఆమె తలపై హిందీ మాస్టారు స్కూలో బ్యాగ్ తో కొట్టాడు. అదే స్కూల్లో సాత్విక తల్లి విజేత పనిచేస్తున్న..హిందీ మాస్టారు మామూలుగానే కొట్టి ఉంటారనుకుని పెద్దగా పట్టించుకోలేదు. తలనొప్పిగా ఉందని మూడు రోజుల నుంచి సాత్విక స్కూలుకి వెళ్లలేదు. దాంతో ఆమెను పుంగనూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. టెస్ట్ చేసిన డాక్టర్..ఆమెను బెంగళూరు తీసుకెళ్లాలని సూచించారు.
సాత్వికను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా..పుర్రె ఎముక చిట్లినట్లు పరీక్షల్లో తేలింది. అది సాత్వికకు తీవ్ర సమస్యగా మారిందని అన్నారు. సోమవారం రాత్రి స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


