అరుదైన ఘనత సాధించిన ప్రధాని నరేంద్రమోదీ
ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్
కాకతీయ, న్యూఢిల్లీ (జూలై 25) : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుదైన ఘనతను సాధించారు. నేటికి.. అనగా 2025, జులై 25 నాటికి ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు.వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన మోడీ.. నేటి వరకూ 4,078 రోజులు ఆ పదవిలో ఉన్నారు. దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన తొలివ్యక్తిగా తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిలిచారు. తాజాగా మోడీ సాధించిన ఘనత గతంలో ఇందిరాగాంధీ పేరుపై ఉండేది. 1964 నుంచి 1977 మధ్యకాలంలో ఆమె 4077 రోజులు దేశప్రధానిగా పనిచేశారు.జవహర్ లాల్ నెహ్రూ ఆగస్టు 15,1947 నుంచి మే 27,1964 వరకు 16 సంవత్సరాల 286 రోజులపాటు దేశ ప్రధానిగా పనిచేశారు. ఈ రికార్డును ఇప్పట్లో ఎవరూ అధిగమించలేరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా.. మోడీ ప్రధాని కాకముందు 2001 నుంచి 2014 వరకు .. 14 సంవత్సరాలపాటు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.


