డీఎంహెచ్‌వో ఆఫీసులో ప్రీ క్రిస్మస్ వేడుకలు
కాకతీయ, హన్మకొండ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య పాల్గొని సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ మానవత్వం, ప్రేమ, సౌభ్రాతృత్వం వంటి విలువలను గుర్తు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ టి. మదన్ మోహన్ రావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుబీనా, పరిపాలనాధికారి కోలా రాజేష్, డెమో వి. అశోక్ రెడ్డి, సూపరింటెండెంట్ వేణు, గణాంక అధికారి ప్రసన్న కుమార్, డిపిఓ రుక్ముద్దీన్, సుదర్శన్, కమలాకర్, హెచ్‌ఈఓలు యాద నాయక్, ఖాదర్ అబ్బాస్, రాజేశ్వర్ రెడ్డి తదితర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


