సమ్మక్క జాతరలో ఒడితల ప్రణవ్
కాకతీయ,హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట దగ్గర జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని తల్లులను దర్శనం చేసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గారు..ఈ సందర్భంగా జాతర నిర్వహణ కమిటీ ఘన స్వాగతం పలికారు.వనం నుండి జనంలోకి తల్లులు వచ్చిన వేళ హుజురాబాద్ నియోజక వర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లులను వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సమ్మక్మ సారలమ్మ జాతర ఛైర్మెన్ గంట కిరణ్ రెడ్డి,వైస్ చైర్మన్ రాజ్ కుమార్,డైరెక్టర్లు,ఈఓ సుధాకర్,హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి,మండల అధ్యక్షుడు కిరణ్,సీనియర్ నాయకులు మహేందర్ గౌడ్,గణేష్,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


