కాకతీయ, కొత్తగూడెం రూరల్: అశ్వరావుపేట, మణుగూరు, కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో నమోదైన మర్డర్ కేసుల్లోని నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆయన కార్యాలయంలో సోమవారం వారిని ఘనంగా సత్కరించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీడీడీ లక్ష్మీ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసీక్యూటర్స్ లావణ్య, విశ్వశాంతి, రాజారావును, మణుగూరు కోర్టు డ్యూటీ అధికారి అశోక్, కొత్తగూడెం 3టౌన్ కోర్ట్ డ్యూటీ అధికారి హేమీలాల్, అశ్వారావుపేట కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ నాగేశ్వరరావులను మర్డర్ కేసుల్లోని నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసినందుకు గాను, సుజాతనగర్ కోర్ట్ డ్యూటీ అధికారి మోహన్, కొత్తగూడెం 3టౌన్ పిఎస్ జె ఎఫ్ సి ఎం కోర్ట్ డ్యూటీ అధికారి శోభన్ ను ఇటీవల లోక్ అధాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేసినందుకు శాలువాలతో సత్కరించారు.
కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై రాఘవ తదితరులు పాల్గొన్నారు.


